Tollywood Heros: పదేళ్లలో ఎంత మార్పు? టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ ఎంతంటే?

Tollywood Heros: ఒక్క సినిమా హిట్టైతే రేంజ్ వేరే లెవల్లో ఉంటుంది. అయ్యవారి ఇంటి ముందు దర్శక నిర్మాతలు క్యూ కట్టాల్సిందే. అడిగినంతా ఇవ్వాల్సిందే.. హీరోలు కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో పాటు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం తెలుగులో స్టార్లుగా వెలుగుతున్న చాలామంది హీరోల పదేళ్ల క్రితం రెమ్యునరేషన్ ఏంటి, ఇప్పుడు రెమ్యునరేషన్ ఏంటి అని పోలుస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

ఒకప్పుడు తెలుగు హీరోలు ఒక్కో సినిమాకు రూ.5-10 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటేనే.. అమ్మో అనుకునేవాళ్లు. కానీ రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ ఆకాశమంత పెరిగింది. మన సినిమాలు బాలీవుడ్‌లోనూ సత్తా చూపిస్తున్నాయి. దాంతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు.

టాప్‌లో ప్రభాస్..
తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ రేంజ్‌కు తీసుకెళ్లిన హీరో ప్రభాస్. ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాస్త.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌గా మారిపోయాడు. అయితే ప్రభాస్ పదేళ్ల క్రితం చేసిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకు తన రెమ్యునరేషన్ రూ.5 కోట్లు ఉండేది. ఇప్పుడు ప్రభాస్ ఒక్క సినిమాకే రూ. 100 నుండి 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకొని అందరికీ షాక్ ఇస్తున్నాడు.

ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీళ్లకి వీళ్లే సాటి
ఆర్ఆర్ఆర్ సినిమాకు రామ్ చ‌ర‌ణ్, జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా రూ.50 కోట్ల చొప్పున రెమ్యున‌రేష‌న్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప‌దేళ్ల క్రితం చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఆరెంజ్ సినిమాకు రూ.6కోట్లు, ఎన్టీఆర్ అదుర్స్ సినిమాకు రూ.7 కోట్ల రెమ్యున‌రేష‌న్ మాత్రమే తీసుకున్నారు.

పారితోషికంలోనూ మహేశ్ బాబు ‘సూపర్’ స్టార్
పదేళ్ల క్రితం మహేశ్ నుండి ఖలేజా, దూకుడు సినిమాలు వచ్చాయి. అప్పుడు తన రెమ్యునరేషన్ కేవలం రూ. 8 కోట్లు మాత్రమే. ఇప్పుడు మహేశ్ పారితోషికం గురించి మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. కానీ ఆయనకు కూడా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుతోందని టాక్ వినిపిస్తోంది.

పవర్ చూపిస్తున్న పవన్ కల్యాణ్
వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే పదేళ్ల క్రితం జల్సా, కొమరం పులి సినిమా టైమ్‌లో పవన్ రూ. 7.5 నుండి 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేవారని టాక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ఒక్క సినిమాకు 50 నుండి 75 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారని సమాచారం.

తగ్గేదేలే అంటున్న పుష్ప
పదేళ్ల క్రితం విడుదలయిన వరుడు, వేదం లాంటి చిత్రాల కోసం రూ.5 నుండి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్.. పుష్ప కోసం ఏకంగా రూ. 30 నుండి 40 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం. ఇక పుష్ప2 కోసం ఏకంగా రూ.100 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

Similar Articles

Comments

తాజా వార్తల