Vishal about his lover: త్వరలోనే తన ప్రేయసిని ఇంట్రడ్యూస్ చేస్తానంటున్న విశాల్.. ఆ భామ ఎవరో!

Vishal about his lover: తమిళంలో స్టార్ హీరోగా సెటిలైన తెలుగు కుర్రాడు విశాల్ రెడ్డి. తమిళంతో పాటు తెలుగులోనూ ప్రతి మూవీనీ డబ్ చేస్తుంటాడు విశాల్. హీరోగా రాణిస్తూనే నిర్మాతగానూ మారిన విశాల్ అనేక చిత్రాలు నిర్మించాడు. తన పేరుతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కూడా స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తమిళనాట ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపాడనే వదంతులు వినిపించాయి. అయితే అవన్నీ అబద్ధమేనంటూ ఇద్దరూ అనేక సార్లు క్లారిటీ ఇచ్చారు కూడా.

విశాల్ పెళ్లి విషయంలో ఇటీవల అనేక వార్తలు వెలువడుతున్నాయి. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డితో నిశ్చితార్థం కూడా చేసుకున్న విశాల్.. తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నాడు విశాల్. తర్వాత సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. అయితే, ఇటీవల మళ్లీ ఓ గాసిప్ మొదలైంది.

నటి అభినయని పెళ్లి చేసుకోబుతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో విశాల్ తో పెళ్లి వార్తలను నటి అభినయ తోసిపుచ్చింది. తాము మంచి నటులమే కానీ భార్యాభర్తలం కాజాలమని పేర్కొంది. విశాల్ తో కలిసి నటించినంత మాత్రాన వివాహం చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించింది నటి అభినయ.

ఇటీవల ప్రేమ, పెళ్లి వార్తలపై విశాల్ స్పందించాడు. కాస్త ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఓ చారిటబుల్ ట్రస్ట్ తో కలిసి కొన్ని జంటలకు తన ఖర్చులతో పెళ్లి జరిపించిన సందర్భంగా విశాల్ స్పందించాడు. తాళి బొట్టుతో సహా ఆ జంటలకు ఆర్థికసాయం చేశాడు విశాల్. ఈ సందర్భంగా విశాల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. తనకి అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదని, ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి పీటలు ఎక్కుతానంటూ వ్యాఖ్యానించాడు. ఇక తాను ప్రేమించిన యువతిని త్వరలోనే అందరికీ పరిచయం చేస్తానంటూ గుడ్ న్యూస్ చెప్పాడు.

Similar Articles

Comments

తాజా వార్తల