Mantra Healing: రోగాన్ని తగ్గించడంలో సహాయం చేసే మంత్రాలు!

Mantra Healing: మంత్రాలు కేవలం దైవాన్ని పూజించడం కోసమే కాకుండా రోగాలని నయం చేసుకోవడానికి కూడా వాడుతారు. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది యధార్థం. అనాదిగా మన వైద్యులు పాటిస్తూ వస్తున్న ఆచారాల్లో మందుతోపాటు మంత్ర పట్టణం కూడా ముఖ్యమైనది.

పూర్వం వైద్యులు రోగికి మందుతో పాటు ఓ మంత్రాన్ని కూడా చదవమని ఇచ్చేవారు. మంత్రం చదివినప్పుడు మన శరీరంలో ఏర్పడే చైతన్యం వల్ల మనసుకు ప్రశాంతత ధైర్యం చేకూరుతుంది.

మంత్రం చదువుతున్నప్పుడు ఆ ధ్వనికి ప్రకృతిలో ప్రతిస్పందించే శక్తులు ఆకర్షించబడి వాటి సత్ఫలితాలను మనకు అందిస్తాయి. ఆ కారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో ఇది నమ్మడానికి విచిత్రంగా , మూఢనమ్మకంగా ఉన్నప్పటికీ పాటించి చూస్తే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. మరి అలా చదివే మంత్రాలలో ముఖ్యమైనవి ఏమిటో తెలుసుకుందాం.

నారాయణీయం:

నారాయణీయం అనేది గురువాయుర్ శ్రీకృష్ణుని మీద రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన. ఈ శ్లోకం జబ్బుతో బాధపడేవారు లేక వారికోసం వారి సన్నిహితులు ఎవరైనా కానీ భక్తిశ్రద్ధలతో చదివితే ఎటువంటి భయంకరమైన రోగమైన సమసి పోతుంది. భయంకరమైన రోగాలు ,దీర్ఘకాలికంగా పీడిస్తున్న జబ్బులు నుంచి ఈ మంత్రం త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది.

వైద్యనాథుడి స్తోత్రం:

వైద్యనాథుడు అంటే స్వయంగా శివుడు. పురాణ కాలం నుంచి ఆయురారోగ్యాల కోసం శివుని ఆరాధించడం అనాదిగా వస్తున్న హైందవ సాంప్రదాయం. చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ప్రదోషకాలంలో ఈ వైద్యనాథుడి స్తోత్రం చదవడం వల్ల ఉపశమనం పొందుతారు.

ఆరుద్ర నక్షత్రం రోజున మట్టితో శివలింగాన్ని చేసి ,బియ్యప్పిండి , గంధం మరియు విభూతితో 18 సార్లు శివార్చన చేయాలి. అర్చన చేసి, వైద్యనాథ్ స్తోత్రం పఠించి,నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తరువాత సంకల్పం చెప్పుకొని నైవేద్యమును సేవించాలి. ఆ తర్వాత మీ చేతులతో ఈ మట్టి లింగాన్ని ప్రవహించే సెలయేటిలో కానీ నదిలో కానీ నిమర్జనం చేయాలి. ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రానికి క్రమం తప్పకుండా చేయాలి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరువాత శివాలయంలో అభిషేకం, అర్చనా చేయించుకోవాలి.

రాహుకాల పూజ:

రాహుకాలంలో దుర్గాదేవి ,సుబ్రహ్మణ్య స్వామి మరియు కాలభైరవుడి స్తోత్రాలు చదవడం వల్ల అకారణంగా వచ్చే భయాలు, పీడలు, ఆందోళనలు అన్ని తొలగుతాయి.

ఇలా చిన్నపాటి మంత్ర పట్టణం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఔషధం సేవించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోవడం వల్ల మనసుకు ధైర్యం కలుగుతుంది. అలాగే వీలున్నప్పుడల్లా తులసి చెట్టుకి గోమాతకి దగ్గరగా కాసేపు గడిపేలా చూసుకోవాలి. వైద్యం చేయించుకోవడం ప్రతి మనిషికి అవసరం. అలాగని దైవ బలాన్ని వదలకూడదు.

Similar Articles

Comments

తాజా వార్తల