Kangana Ranaut: ఇన్‌స్టాగ్రామ్ మూగది.. ట్విటర్ గొప్పది అంటున్న కంగనా రనౌత్

Kangana Ranaut: బాలీవుడ్‌లో పెద్ద స్టార్లు, తోటీ నటీనటులు, పలు రాజకీయ, వివాదాస్పద అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ హీరోయిన్ కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో ఉంటుంది. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ఒక మూగబోయిన సోషల్‌మీడియా అని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌తో పెద్దగా యూజ్‌ లేదని, ఇదేమంత ప్రభావంతమైనది కాదంటూ అసహనం వ్యక్తం చేసింది. ట్విటర్‌ ఉత్తమైన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అంటూ కొనియాడింది.

ఈమేరకు తాను విమర్శలు చేసిన ఇన్‌స్టాలోనే ఓ పోస్టు షేర్ చేస్తూ.. ‘ఇన్‌స్టాగ్రామ్‌ మూగబోయిన గది లాంటిది. ఇది ఫొటోలకు మాత్రమే ఉపయోగపడుతుంది. విలువైన సమచారాన్ని ఇందులో ఉంచలేం. నిన్న ఏం రాశాయో మరోసటి రోజు మాయమైపోతుంది. దీని వల్ల మన ఆలోచలను డాక్యుమెంట్‌ చేసుకునే వీలు లేదు. తాము ఏం చెప్పాం, ఏం రాశామోనన్న స్పృహ లేని వాళ్లకు ఇది సరైన వేదిక. కానీ, మాలాంటి వారి పరిస్థితి ఏంటి? వారు చెప్పే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. మనుషుల కోసం వారి ఆలోచనలను డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారు. వాటిని లోతుగా పరిశోధించడానికి ప్రయత్నిస్తారు. ఇవి మినీ బ్లాగులు. ఇవి సబ్జెక్ట్‌తో పాటు ఇతరులు ఉపయోగపడేలా ఉండాలి’ అంటూ రాసుకొచ్చింది.

ట్విటర్‌పై పొగడ్తలు..

ట్విటర్‌ ఓ గొప్ప సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్ అని, మేధోపరంగా, సైద్ధాంతిక పరంగా ప్రేరేపించేందుకు ఇది ఉత్తమైన వేదిక అని కంగనా కొనియాడింది. గతంలో కంగనా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్ట్‌లు కారణంగా 2021లో ఆమెను ట్విటర్‌ నిషేధించిన సంగతి తెలిసిందే. ట్విటర్‌ నిబంధనలను ఉల్లఘించడం వల్ల ఆమె ఖాతాను తొలగించారు.

ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్‌ పగ్గాలు అందిన సంగతి తెలిసిందే. ట్విటర్‌ పాలసీ సమీక్ష అనంతరం నిషేధానికి గురైన వారిని తిరిగి అనుమతిస్తామంటూ మస్క్ ఇటీవల ప్రకటన చేశాడు. దీనిపై కంగాన ఆనందరం వ్యక్తం చేస్తూ.. ఎలాన్‌ మాస్క్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. మరోసారి ఆమె ట్విటర్‌కు వెళ్లేందుకు ఆసక్తిగా ఉంది. అదే క్రమంలో ఇన్‌స్టాపై విమర్శలు చేస్తోంది.

Similar Articles

Comments

తాజా వార్తల